top of page

Culture & Minorities Bharosa

 మైనారిటీ  రిజర్వేషన్లు

1. ఆర్థికంగా వెనుకబడిన మైనారిటీలకు 12% రిజర్వేషన్లు( 4% వెనకబడ్డ  ముస్లింలకు మరియు 1% వెనుకబడిన క్రైస్తవులకు) విద్య, వైద్యం, ఉపాధి, ఆర్థిక, పారిశ్రామిక, రాజకీయ మరియు రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో ప్రాధాన్యం ఇవ్వడం.


2. మైనారిటీలకు అన్ని స్థానిక సంస్థలలో జనాభా ప్రాతిపదికన స్థానాలు కేటాయించడం.

CROWD.png
C&M B1.jpg
CROWD.png
C&M B2.jpg

 దైవిక భరోసా

1. అర్హులైన ఇమామ్‌లు, మ్యూజ్జిన్లు, పాస్టర్‌లు, పూజారులకు,బంతీలకు  ప్రభుత్వ పే స్కేల్ ప్రకారం  రూ. 10,000 గౌరవ వేతనం.ఇమామ్ మరియు మౌజన్ స్థానాల కోసం పెండింగ్‌లో ఉన్న అన్ని దరఖాస్తుల ప్రరిష్కారం

 

2. వక్ఫ్  ఆస్తుల బోర్డు ఆక్రమణలన్నీ తొలగించి. వక్ఫ్ భూములని నామమాత్రపు ధరలకు (100 చదరపు గజాలకు రూ. 65 చొప్పున) ఇళ్ళు లేని పేద ముస్లింలకు అద్దెకు ఇచ్చే ఏర్పాటు చేయడం

 

3. వక్ఫ్ బోర్డుకు న్యాయపరమైన అధికారాలు ఇచ్చి భూమి ఆక్రమణదారులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కమిషనరేట్‌ నియామకం

4. దర్గాల పరిరక్షణ కోసం ఒక సరికొత్త విధాన రూపకల్పన 

 

5. ప్రతి గ్రామంలో క్రైస్తవులకు స్మశాన వాటికల నిర్మాణం 

 బహుజన గ్రామదేవత బోర్డు (BGB)

1. స్థానిక గ్రామ దేవతలకు (పోచమ్మ, మైసమ్మ, మొదలైనవి) మరియు జాతరలు,పండుగలు గొప్పగా నిర్వహించడానికి  బహుజన గ్రామదేవత బోర్డు ఏర్పాటు చేయడం

 

2. BGB దేవాలయ నిర్మాణాల నిర్వహణను పర్యవేక్షించడంతో పాటు రోడ్లు నీటి సరఫరా వంటి మౌలిక  సౌకర్యాలను కల్పిస్తూ సిబ్బంది సంక్షేమం మరియు భక్తుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం  

 

3. దేవాలయాల బోర్డుల నిర్వహణ స్థానిక నాయకుల సమన్వయ సహకారాలతో సమర్ధవంతంగా జరిగేలా చేయడం

 

4. బహుజన పండుగలను రాష్ట్ర పండుగలుగా గుర్తింపు : మేడారం జాతర, పీర్ల పండుగ, కొమురవెల్లి మల్లన్న జాతర వంటి మెజారిటీ జనాభాచే జరుపుకునే పండుగలను అధికారికంగా గుర్తించి మన సాంప్రదాయాలపై అవగాహన పెంచే కార్యక్రమాలు చేయడం  

5. బహుజన గ్రామ దేవత బోర్డు తెలంగాణ గ్రామ దేవతలు,విశ్వాసాల మీద అధ్యయనానికి సహకారం ఇవ్వడంతో పాటు  సంబంధించిన సమాచార నిర్వహణలో మద్దతుగా ఉంటుంది

 

CROWD.png
C&M B3.jpg
CROWD.png
C&M B4.jpg

సుద్దాల హనుమంతు జానపద జ్యోతి

1. తెలంగాణ అంతటా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేయడానికి  18-45 సంవత్సరాల వయస్సు గల జానపద కళాకారులకు నెలకు రూ.3000 గౌరవ వేతనంతో నియామకంతో పాటు సరైన నైపుణ్య వినియోగం,జీవనోపాధి ప్రోత్సాహం మరియు సాంస్కృతిక అభివృద్ధికి ఆసరా 

2. సీనియర్ జానపద కళాకారులకు (45 సంవత్సరాల) జీవనోపాధి మద్దతుగా రూ. 5000. నెలవారీ పింఛను అందించడం

 

3. కరీంనగర్ జిల్లాలోని గద్దర్ స్వేచ్ఛా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసి తత్వరా బుర్రకథ, యక్షగానం, వీధి నాటకం, హరిదాసు మరియు రాష్ట్రంలోని ఇతర కళలతో సహా సమకాలీన కళలపై పరిశోధన, బోధన ప్రోత్సహించుట.బహుజన గ్రామదేవత బోర్డు భాగస్వామ్యంతో స్థానిక దేవతలు లేదా గ్రామదేవతలకు సంబంధించిన నమ్మకాలు,ఆచారాలపై పరిశోధనలు నిర్వహించడం.

 

 బహుజన సినిమా పరిశ్రమ

1. బహుజన్ ఫిల్మ్ కార్పొరేషన్ (BFC)ని ఏర్పాటు చేసి  మరియు ప్రతి సినిమా నిర్మాణంలో రూ. 10,000 కోట్లు పెట్టుబడే లక్ష్యంగా పనిచేయడం 

 

2. బహుజన నేపధ్య చలనచిత్రాలు మరియు చిత్ర నిర్మాతలకు ఆర్థిక సాయానికి ప్రత్యేక  క్రెడిట్ కార్డ్‌లు. 

 

3. ప్రతిభకు ప్రోత్సాహం: సినిమా నిర్మాణం, మల్టీప్లెక్స్ కాంట్రాక్ట్  వంటి అంశాలలో మైనారిటీలకు శిక్షణ ఇవ్వడం.దర్శకులు ,నిర్మాతలు మరియు సాంకేతిక నిపుణుల వివరాల నమోదుకు ప్రత్యేక ఏర్పాటు.

 

4. బహుజన ప్రాతినిధ్యం: బహుజన పాత్రలు మరియు సంప్రదాయాలు, వారి పోరాటాలు మరియు విజయాలను వెలికి తీసే చిత్రాలను రూపొందించడంపై దృష్టి పెట్టడం.


5. పరిశోధన మరియు సాహిత్య ముద్రణ:బహుజన సాహిత్యంపై జరిగే పరిశోధనల్ని ప్రోత్సహించడంతో పాటు ముద్రించడానికి ప్రొత్సాహం ఇవ్వడం

CROWD.png
C&M B5.jpg
CROWD.png
WhatsApp Image 2023-10-21 at 1.19.57 PM.jpeg

 బహుజన్ సైన్స్ సిటీ

1. ప్రకృతి చరిత్ర వైజ్ఞానిక కేంద్రం: పురాతన కళాఖండాలు,వన్యప్రాణులు, సంస్కృతులు వంటి వాటిని తెరల  ద్వారా ప్రదర్శించడం వల్ల  సందర్శకులు జాతుల పరిణామం,వాతావరణ మార్పు భూ విజ్ఞానం వంటి అంశాలపై అవగాహన పెంచుకునేలా  ఏర్పాటు 

 

2. అంతరిక్ష డోమ్: గ్రహణాలు, ఉల్కల వర్షాలు, గ్రహాల అమరిక వంటి ఖగోళ దృశ్యాలను  చూడటానికి డిజిటల్ ప్రొజెక్షన్ వ్యవస్థ ఏర్పాటుతో పాటు రాత్రి ఆకాశ  అనుభవాలను అందించడానికి వర్చువల్ రియాలిటీ (VR) ఏర్పాటు.

 

3. అక్వేరియంలు: సముద్ర పర్యావరణ వ్యవస్థల  జీవిత చక్రాన్ని సందర్శకులు అర్థం చేసుకోవడానికి  నడక ద్వారా తాకే ట్యాంకులలో సముద్ర నివాసాలు ఏర్పాటు చేయడం. సైన్స్ విద్యకు మాత్రమే కాకుండా పర్యావరణ  పరిరక్షణపై అవగాహన కల్పించడం


4. డిస్కవరీ డోమ్: ఐమాక్స్ స్క్రీన్‌లపై డాక్యుమెంటరీలు మరియు ఇతర సైన్స్ ఫిక్షన్ సినిమాలను ప్రదర్శించడం ద్వారా పెద్ద స్క్రీన్‌లు ,శక్తివంతమైన సౌండ్ సినిమాటిక్ అనుభవాన్ని సృష్టించడం.

 కాన్షిరాం బహుజన్ సైన్స్ సిటీ

​1. అన్ని మతపరమైన విశ్వాసాల  ప్రదేశాలను నిర్వహణ మరియు సంరక్షణకి  రూ. 5,000 కోట్ల నిధుల  మంజూరు 

2. సాంస్కృతిక వారసత్వాన్ని గౌరవించడానికి ప్రముఖుల పేరు మీద జిల్లాల పేర్లు మార్చడం:మునుపటి ముల్గు జిల్లాను సమ్మక్క-సారక్క ముల్గు జిల్లాగా, ఖమ్మం జిల్లాను కిస్టయ్య ముదిరాజ్ ఖమ్మం జిల్లాగా, జనగాం జిల్లాను సర్వాయి పాపన్న జనగాం జిల్లాగా, సూర్యాపేట జిల్లాను దున్న ఇద్దాసు సూర్యాపేట జిల్లాగా, మెదక్ జిల్లాను  గద్దర్ మెదక్ జిల్లాగా, మహబూబాబాద్ జిల్లాను పండుగ సాయన్న మహబూబాబాద్ జిల్లాగా, భువనగిరి-యాదగిరి జిల్లాను బెల్లి లలిత భువనగిరి-యాదగిరి జిల్లాగా మార్పు.

3. గ్రామాల్లో నీటి వనరుల చుట్టూ బతుకమ్మ విగ్రహాలు,మెట్లు మరియు వేడుకలకు అవసరమైన ఇతర నిర్మాణాలు ఏర్పాటు చేయడం

4. బహుజన పర్యాటక క్షేత్రాలు:దేశంలో ఉన్న బౌద్ధ క్షేత్రాలను అనుసంధానిస్తూ వలయం ఏర్పాటు.బోధగయ, మాన్యవర్ కాన్షీరామ్ జ్ఞాపకార్థ పార్క్ (లక్నో), చైత్యభూమి (ముంబై), డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సాంఘిక పరివర్తన స్థల్ (లక్నో), భీమా కోరేగావ్ 'విజయ స్తంభం' (పుణె సమీపంలో), మార్గాల అనుసంధానం.

5. తెలంగాణ యాత్రికుల సౌకర్యర్థం 2018 లోనే రూ.5 కోట్ల మంజూరై రాజస్థాన్‌లోని అజ్మీర్ దర్గా దగ్గర నిర్మించాల్సిన రుబాత్ (అతిథి గృహం) నిర్మాణ పనుల్ని వేగవంతం చేయడం

6. తెలంగాణ యాత్రికుల కోసం బోధగయ, కాశీ, బాసిలికా ఆఫ్ బోం జేసస్ మరియు ఇతర మతపరమైన ప్రదేశాలలో అందుబాటు ధరలకు అత్యాధునిక ‘తెలంగాణ భవన్‌లు’ అందుబాటులోకి తేవడంతో పాటు  ఆన్‌లైన్ బుకింగ్ ద్వారా  ఆహారం, వృద్ధ యాత్రికులకు సేవలను సులభతరం చేయడం

7. దేశంలో ఉన్న ప్రముఖ బౌద్ధ క్షేత్రాలైన నాగపూర్,భోద్ గయ,సాంచి,సారనాధ్ వంటి క్షేత్రాలని కలుపుతూ బౌద్ధ వలయం ఏర్పాటు

CROWD.png
C&M B7.jpg
CROWD.png
C&M B8.jpg

గద్దర్ ఫ్రీడమ్ విశ్వవిద్యాలయం ఏర్పాటు 

1. తెలంగాణ సంస్కృతి,జానపదాలు మరియు జానపద సాహిత్యాన్ని అధ్యయనం చేయడానికి గద్దర్ ఫ్రీడమ్ విశ్వవిద్యాలయం ఏర్పాటు 

2. చిందు,యక్షగానం,బుర్రకథ,డప్పు,హరిదాసులు వంటి జానపద  కళలను ప్రోత్సహించడంతో పాటుగా నెలవారీ ఫించన్ అందజేత 

3. తెలంగాణ ఉద్యమ కారులకు హెల్త్ కార్డులను అందజేయడంతో పాటుగా ప్రభుత్వ కాంట్రాక్టుల్లో అవకాశం కల్పించడం

CROWD.png
WhatsApp Image 2023-10-21 at 1.20.09 PM.jpeg

Home

About

Get Involved

Gallery

Helpdeskl

Bahujan Samaj Party

-TELANGANA-

  • Facebook
  • Twitter
  • YouTube

040-29390888

© 2023 by Bahujan Samaj Party, Telangana.

6-2-48, AC Guards,
Opp: Hyundai Showroom Lane,
Lakdi-ka-pool,

Hyderabad, 500 004,
Telangana, India

https://bahujansamajparty.net

bottom of page