top of page

Aarogya  Bharosa

రూ. 25,000 కోట్ల ఆరోగ్య బడ్జెట్

1. మొత్తం బడ్జెట్ వ్యయంలో ప్రస్తుత 5% నుంచి  ఆరోగ్య బడ్జెట్‌ను 10%కి పెంపు లేదా రూ. 25,000 కోట్లు (ప్రస్తుత 5% నుండి) పెట్టుబడి.

2. ఆశా వర్కర్లకు జీతం రూ. నెలకు 15,000 (రూ. 9,750 నుండి) నిశ్చయంగా పెంపు  మరియు రూ. 15 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ (రూ. 10 లక్షల నుంచి).

3.ప్రతి మండలంలో (గ్రామీణ) 20 మాయా మెడికల్ షాపులను  ప్రారంభించడం , అందుబాటు ధరలో జనరిక్ ఔషధాలను అందించడం మరియు ఆసుపత్రిలో చేరడం ద్వారా    రు. 20,000  అయ్యే   ఖర్చును  తగ్గించడం 

4. ప్రతి 30,000 గ్రామీణ జనాభాకు ఒక్క పబ్లిక్ హెల్త్ సెంటర్ (PHC) అనే జాతీయ ఆరోగ్య మిషన్ మార్గదర్శకాలను అనుసరించి తెలంగాణను తీసుకురావడానికి గ్రామీణ ప్రాంతాల్లో 77 కొత్త పబ్లిక్ హెల్త్ సెంటర్లను (PHC) నిర్మాణం.  - ప్రతి గ్రామ పంచాయతీ వద్ద ఒక్క   పబ్లిక్ హెల్త్ సెంటర్ (PHC)  ఏర్పాటు. 

5. అన్ని ఆరోగ్య కేంద్రాలలో ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేయడం : ఉదా - తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో 227 మంది ఫార్మసిస్ట్‌లు మరియు 227 ల్యాబ్ టెక్నీషియన్‌లను నియమిచడం. 

6. తెలంగాణలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 200 పడకలతో అంతర్జాతీయ స్థాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నెలకొల్పడం ద్వారా స్థానిక ప్రజల ఆరోగ్య అవసరాలను తీర్చడమే కాకుండా మెడికల్ టూరిజంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుతాం

CROWD.png
AB 01.jpg
CROWD.png
AB 02.jpg

 రూ. 5000 కోట్లతో  ‘ఆహార నిధి’

1. మహిళల్లో రక్తహీనత, 5 ఏళ్ల లోపు పిల్లల్లో పోషకాహార లోపాన్ని ఎదుర్కోవడానికి రూ.  5000 కోట్లు  ను ప్రత్యేకంగా  పోషకాహార బడ్జెట్‌గా కేటాయించుట.జిల్లాల్లో ఆహార పరీక్ష కేంద్రాల ఏర్పాటు చేయుట. 

 

2. రాష్ట్ర ప్రభుత్వం మే  ధాన్య సేకరణ మరియు సులభంగా లభ్యత కోసం PDS మరియు మధ్యాహ్న భోజనంలో 'సిరిధాన్య' మిల్లెట్‌లను (రాగులు, జొన్నలు, కొర్ర మొదలైనవి ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం మరియు యాంటీఆక్సిడెంట్‌లతో సమృద్ధిగా ఉంటాయి) అందుబాయిలోకి తేవడం

3. రక్తహీనత పరీక్ష మరియు చికిత్స: టీనేజ్ బాలికలు మరియు మహిళలు (14-18 సంవత్సరాలు) ప్రతి త్రైమాసికంలో విద్యా సంస్థలు మరియు ఆసుపత్రులలో హిమోగ్లోబిన్ స్థాయిల కోసం రక్త పరీక్షలు నిర్వహించబడతాయి. రక్తహీనత ఉన్న మహిళలకు పౌష్టికాహారం అందచేయబడతాయి: ఖర్జూరాలు, విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు రాగి లడూలు, మహిళలకు ఆసుపత్రులలో సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్యాకెట్లు (5gm, 10 gm xxx)  అందచేయబడతాయి. 

 

4. ఆహరం కలుషితం కాకుండా ప్రతి మండల కేంద్రంలో ఆహార పరీక్ష ల్యాబులు ఏర్పరిచి మహిళలు,పిల్లల్ని పోషకాహార లోపం నుంచి రక్షించడం

అందరికీ ‘ఆరోగ్యశ్రీ’ ఆరోగ్య బీమా

 

​1. తెలంగాణలోని అన్ని అనధికారిక కార్మికులు (గిగ్ మరియు గృహ కార్మికులు), వలసదారులు, భూమిలేని రైతులు, ట్రాన్స్‌జెండర్లు సహా అందరూ ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చేలా ఏర్పాటు.   

 

2. సున్నా ప్రీమియంతో ప్రభుత్వ మరియు ప్రభుత్వ ఎంపానెల్ ఆసుపత్రుల లో కుటుంబ సభ్యులందరికి  15 లక్షల బీమా ప్యాకేజీని ఆరోగ్యశ్రీలో చేర్చటం ,  7 లక్షల వరకు చికిత్సలు ఉచితం. గ్రేడెడ్ సబ్సిడీ ప్లాన్‌కు అర్హులైన 7 లక్షల కంటే ఎక్కువ మొత్తాలు:

  • వర్గం 1 - సంవత్సర  ఆదాయం 1 లక్ష  లోపు వాళ్ళకి    100% సబ్సిడీ (పా)

  • వర్గం 2 - సంవత్సర ఆదాయం  1 లక్ష నుంచి 3 లక్షలు  పొందే వారికి  75% సబ్సిడీ

  • వర్గం 3 - సంవత్సర ఆదాయం  3 లక్షలు నుంచి 5 లక్షలు  పొందే వారికి  50% సబ్సిడీ

  • వర్గం 4 - సంవత్సర  ఆదాయం 5 లక్షలు  నుంచి 10 లక్షలు  పొందే వారికి 25% సబ్సిడీ

  • వర్గం 5 -  సంవత్సర  ఆదాయం  10 లక్షలు దాటి  పొందే వారికి 10% సబ్సిడీ

 

3. గుండె మరియు న్యూరో సర్జరీలు, అవయవ మార్పిడి, క్యాన్సర్, గర్భం, మధుమేహం, దంత సంరక్షణ మరియు మానసిక ఆరోగ్య మద్దతు, ఫిజియోథెరపీ, ప్రీ-ఆపరేటివ్ టెస్ట్‌లతో సహా చికిత్సానంతర సంరక్షణ వంటి చిన్న మరియు పెద్ద చికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొని రావడం.

 

​4.ప్రతి నెల క్యాన్సర్ రోగులకు రూ. 10,000 పెన్షన్.

CROWD.png
AB 03.jpg
CROWD.png
AB 04.jpg

"కాన్షీరామ్" ఆయుష్మాన్ యోజన

 

​1. 24x7 ప్రాణ కవాచ్ కాల్ సెంటర్‌లు: రిజిస్టర్డ్ చేయబడిన ప్రతి ఒక్కరికి ఆరోగ్య ప్రొఫైల్‌లను సృష్టించి , దీని ఆధారంగా ప్రజలను ఉత్తేజపరచడానికి సందేశంతో కూడిన  ఆటోమేటెడ్ వేక్-అప్ కాల్స్ వచ్చే విధంగా ఏర్పాటు . ( అడుగుల లేఖియింపు (స్టెప్ అకౌంట్) , హైడ్రేషన్, ఆహార నియమాల  సంబంధమైన లక్ష్యాలు, కాలానికి తగ్గట్టుగా ఆరోగ్య చిట్కాలు, సీట్ బెల్ట్ వినియోగం మరియు మరిన్నింటిని సంబంధించిన సమయానుకూలంగా  ఫోన్ కు సందేశాలు పంపడం.  తెలంగాణను వెల్‌నెస్ లీడర్‌గా మార్చడానికి లక్ష్యాలను నిలకడగా చేరుకునే వ్యక్తులకు ప్రాణ కవచ్ అవార్డులు

 

2. 12,000+ గ్రామ-స్థాయి వాకింగ్ ట్రాక్‌లు  మరియు దూరం కోసం సూచికలు , అందుబాటు స్థలాలలో అన్ని వయసుల వ్యక్తులను, ప్రత్యేకించి వృద్ధులను తేలికపాటి వ్యాయామాలు  చేసుకునే వెసులుబాటు కల్పించడం.  

 

3. కుటుంబం అంతా  కలిసి వ్యాయామం చేసుకునేలా   ప్రోత్సహించడానికి అన్ని వయసుల వారికి ఉపయోగపడే  పరికరాలతో గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఓపెన్-ఎయిర్ జిమ్‌లు, చిన్నప్పటి నుండి పిల్లలు మరియు యువతలో ఆరోగ్యకరమైన అలవాట్లను పెంపొందించడం. వ్యాయామ సెషన్‌లను నిర్వహించడానికి స్థానిక క్రీడాకారులను ఆహ్వానించడం  

 

4. సీజనల్ ఫిట్‌నెస్ పండుగలను నిర్వహించం ద్వారా టగ్-ఆఫ్-వార్, కబడ్డీ, ఖో-ఖో, గాలిపటాలు ఎగరవేయడం, చిన్ని-తండ్రి (హాప్‌స్కోచ్), చెరువు ఈత మొదలైన వాటి ద్వారా ఉద్యమం రోజులో పొందిన స్ఫూర్తి  పొందవచ్చు 

5. ప్రతి జిల్లాలో మానసిక ప్రశాంతత మరియు ఆరోగ్యాన్ని పెంపొందించడానికి ఉపాసన కేంద్రాలు మరియు ప్రకృతి వైద్య కేంద్రాలు ఏర్పాటు చేయడం

"బెల్లి లలిత" కమ్యూనిటీ హెల్త్ ఇనిషియేటివ

​1. 2 లక్షల అనధికార 'బెల్ట్ షాపులను' మూసివేత, ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్-5 ప్రకారం భారతదేశంలో  ముఖ్యముగా  - తెలంగాణ  లోనే  అత్యధికముగా  మద్యం వినియోగం ఉన్నందున , దాన్ని  నియంత్రించడానికి ఇది దోహదపడుతుంది.  ఇది మద్యం సంబంధిత వేధింపులు మరియు ఆర్థిక నష్టాల నుంచి మహిళలను రక్షించడమే కాకుండా కాలేయం మరియు మూత్రపిండాల సమస్యల వంటి ఆరోగ్య భారాన్ని కూడా తగ్గిస్తుంది.

 

2. రిహాబిలిటేషన్ సెంటర్‌లను (DARCలు) ఏర్పాటున చేయడం ద్వారా మాదకద్రవ్యాలకు బానిసలైన వాళ్ళందరికీ   వ్యతిగత చికిత్స ప్రణాళికలు, కౌన్సెలింగ్, గ్రూప్ థెరపీ, కాగ్నిటివ్-బిహేవియరల్ థెరపీ (CBT)  మరియు అన్ని  రకాల చికిత్సలు అందుబాటులోకి తేవడం . ఆహ్లాదకర వాతావరణం పెంపొందించడానికి కోసం  శారీరక శ్రమ కూడిన  కార్యకలాపాలు, ఆర్ట్ థెరపీ, కుటుంబ ప్రమేయం, ఔట్ పేషెంట్ రోగులకు సపోర్ట్  వంటి వాటిని చేర్చడం జరుగుతుంది.

3. పోలీసు శాఖ, , ఆరోగ్య శాఖ, విద్య మరియు సామాజిక సేవ వంటి రంగాల నుంచి అంకిత భావంతో పనిచేసే వ్యక్తులతో ఒక్కయాంటీ-డ్రగ్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి   దానిద్వారా అక్రమ రవాణా మార్గాలపై డేటాను సేకరించడం మరియు విశ్లేషించడం, డ్రగ్ ట్రాఫికర్లు మరియు అక్రమ మాదకద్రవ్యాల తయారీదారులను పట్టుకోవడం, నివారణ ప్రచారాలను అభివృద్ధి చేయడం మరియు అమలు చేయడం వంటి చేయడం జరుగుతుంది .

CROWD.png
AB 05.jpg
CROWD.png
AB 06.jpg

"చిట్యాల ఐలమ్మ" మొబైల్ ఆరోగ్య పథకం

​1. మారుమూల ప్రాంతాలైన గిరిజన మరియు కొండ ప్రాంతాలు   సవర, కొండ దొర, గదబ, గొండ, మన్నె దొర, ముఖ దొర మరియు కోయస్ వంటి చోట ఎక్కడైతే ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలకు పరిమితంగా ఉంటాయో అక్కడ మొబైల్ హెల్త్ యూనిట్లను ఏర్పాటు చేసి, వాటి ద్వారా  టెలిమెడిసిన్ సంప్రదింపులు, స్క్రీనింగ్‌లు, టీకాలు మరియు ప్రాథమిక చికిత్స అందించడానికి యూనిట్లు ఏర్పాటు . ఆరోగ్య అవగాహన ప్రచారాలకు, స్థానిక సమాజ విశ్వాసాలను గౌరవించటానికి మరియు ఆరోగ్య సంరక్షణ పద్ధతులను ప్రోత్సహించడానికి సిబ్బందికి శిక్షణ ఇవ్వబడుతుంది 

 

2. డ్రోన్ టు డోర్: దూర ప్రాంతాల  పరిమితులు మరియు ట్రాఫిక్ రద్దీ వంటి సవాళ్లను అధిగమించడానికి డ్రోన్‌ల ద్వారా ఇంటి గుమ్మం వద్దకే  మెడిసిన్ డెలివరీ. రకరకాల  యాప్‌ల ద్వారా, ప్రత్యేక  కోడ్ ద్వారా మరియు ముక్కకవళిక గురుతుంపు  ద(ఫేషియల్ రికగ్నిషన్) టెక్నాలజీ ద్వారా సురక్షితమైన మరియు వేగవంతమైన డెలివరీ చేయబడతాయి 

 

3. 108 అంబులెన్స్ సేవలను పునరుజ్జీవింపచేయడం: అవసరమైన వైద్య పరికరాలు, GPS ట్రాకింగ్, అధునాతన ప్రథమ చికిత్సలో శిక్షణ పొందిన సిబ్బంది మరియు రవాణాలో ఉన్న రోగులకు సౌకర్యాన్ని అందించడానికి సమర్థవంతమైన కమ్యూనికేషన్‌తో కూడిన బాగా నిర్వహించబడే అంబులెన్స్‌లకు అప్‌గ్రేడ్ చేయడం . ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన పేషెంట్ ని సురశ్చితము గా  ఇంటికి చేర్చడం ద్వారా  పేషెంట్ కి 108 యొక్క  పూర్తి అనుభవాన్ని పేషెంట్ కు అందజేయడం 

 

4. 108 మొబైల్ హెల్త్ సర్వీస్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ

 

5. 104 ప్రాణ మిత్ర హాట్‌లైన్: భారతదేశంలో ఎక్కడి నుండైనా తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రులలో అపాయింట్‌మెంట్‌లను బుక్ చేసుకోవడానికి, శస్త్రచికిత్సకు ముందు మరియు శస్త్రచికిత్స అనంతర కేర్ బుకింగ్‌తో సహా ఒకే ప్రత్యేక టోల్-ఫ్రీ ఫోన్ నంబర్ ఏర్పాటు . తెలంగాణ ఆరోగ్య సంరక్షణను విస్తృతం చేయడమే కాకుండా సేవలను క్రమబద్ధీకరించడం కూడా లక్ష్యంగా  సిస్టమ్‌లోని ఖాళీలు మరియు ఓవర్‌లోడ్‌లను గుర్తించడానికి, వైద్యుల జవాబుదారీతనాన్ని మెరుగుపరచడానికి మరియు ప్రభుత్వ ఆరోగ్య సేవకు ఖర్చుతో ప్రైవేట్ ప్రాక్టీస్‌ను నిరుత్సాహపరచడానికి ఫోన్ కాల్‌ల ద్వారా సేకరించిన డేటా విశ్లేషించబడుతుంది.

చిట్యాల ఐలమ్మ మానసిక ఆరోగ్య పథకం

1. మానసిక ఆరోగ్యానికి ప్రత్యేక సైకలాజికల్ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటుచేయడం: రాష్ట్రం లో అన్ని  పని ప్రదేశాలలో మరియు వివిధ సామాజిక  స్థాయిలో ముఖ్యమైన ప్రాంతాలను గుర్తించి  వివిధ రంగంలో నిష్టాతులైయా మనస్తత్వవేత్తలు, మనోరోగ వైద్యులు, సామాజిక కార్యకర్తలు మరియు పరిశోధకుల బృందం ఏర్పాటు;  సమస్యలను గుర్తించి పరిష్కరించడం కోసం  50,000 మంది ఆరోగ్య సంరక్షణ నిపుణులకు శిక్షణ ఇవ్వడం ; భావోద్వేగం ఎలా నియంత్రించాలి అనే దానిమీద  పాఠశాలలు మరియు కళాశాలల కోసం విద్యా కార్యక్రమాలను అభివృద్ధి చేయడం ; సంక్షోభాలు, ముఖ్యంగా విపత్తులు, ప్రమాదాలు, మహమ్మారి సమయంలో ప్రతిస్పందించడానికి ప్రోటోకాల్‌లను ఏర్పాటు చేయడం 

 

2. ఉచిత చికిత్స: ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వ ఆసుపత్రులు మరియు క్లినిక్‌ల ద్వారా మానసిక ఆరోగ్య సమస్యలకు ఉచిత చికిత్స అందించడం

 

3. ప్రతి జిల్లా ఆసుపత్రిలో ప్రత్యేక మానసిక ఆరోగ్య కేంద్రాలు: సాధారణ ఆరోగ్య సంరక్షణతో పాటు  మానసిక ఆరోగ్యాన్ని అనుసంధానం  చేయడం, సాక్ష్యలా ఆధారంగా మానసిక సమస్య నిద్దరణ , వ్యక్తిగత మరియు సమూహ చికిత్స, మందుల నిర్వహణ, ధ్యానం మరియు కుటుంబ సభ్యుల సహకారం  ద్వారా చికిత్స మెరుగు పరచుట. ఇలాంటి సౌకర్యవంతంగా వాతావరణం కల్పించడం తో పాటు రోగి యొక్క వివరాలు గోప్యంగా ఉంచడం  జరుగుతుంది 

 

4. చాకలి ఐలమ్మ మొబైల్ హెల్త్ యూనిట్ల ద్వారా మారుమూల ప్రాంతాల్లో కౌన్సెలింగ్ మరియు మందులు; 24*7 సంక్షోభ పరిస్థితులను నిర్వహించడానికి, సానుభూతితో వినడానికి మరియు జిల్లా స్థాయి మానసిక క్షేమ కేంద్రాలకు సిఫార్సులను అందించడానికి బహుళ భాషల్లో టోల్-ఫ్రీ హాట్‌లైన్ ఏర్పాటు

CROWD.png
AB 07.jpg
CROWD.png
AB 08.jpg

ట్రాన్స్‌జెండర్ బీమా భరోసా

1. 33 జిల్లాల్లో ట్రాన్స్‌జెండర్ల కోసం హెల్త్ అండ్ వెల్‌బీయింగ్ క్లినిక్‌ల ఏర్పాటు

 

2. ఆరోగ్యశ్రీ ద్వారా లింగ నిర్ధారణ మరియు పరివర్తన శస్త్రచికిత్స కోసం 100% ఉచిత బీమా రక్షణను అందించడం జరుగుతుంది. 

 

3. పేదరికం  నివసిస్తున్న 18 ఏళ్లు పైబడిన ట్రాన్సగెండెర్స్ అందరికీ  .

రూ. 4,500 నెలవారీ పెన్షన్

bottom of page