యువజన భరోసా
ఫూలే విద్య భరోసా
1. విద్యార్థులందరికీ మెట్రోలో సహా అన్ని ప్రభుత్వ బస్సులలో 50% ఉచిత ప్రయాణ రాయితీ కల్పన. ఉద్యోగ దరఖాస్తుదారులు లేదా అభ్యర్థులు తమ ఇంటర్వ్యూ లేఖతో లేదా పరీక్ష హాల్ టికెట్లను 'ఉచిత పాస్' గా వినియోగించవచ్చు.
2. విద్యార్థులు సాయుధ దళాల్లో చేరేలా, వారికి బాధ్యత గల పౌరులుగా మెరుగైన భవిష్యత్తును నిర్మించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలో సైనిక్ పాఠశాలల ఏర్పాటు.
3. భీమ్ విదేశీ విద్యా: ప్రతి మండలం నుంచి 100 విద్యార్థులను ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపడం. విద్యార్థులందరికీ విదేశీ చదువుల కోసం ప్రత్యేకమైన 6-వారాల ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌తో వారి రెజ్యూమ్‌ను రూపొందించడానికి అవకాశం.
4. 8వ తరగతి నుండి 12వ తరగతి వరకు, 4వ భాషగా Coding మరియు AI ను ప్రవేశపెట్టడం .
5. అన్నీ ప్రభుత్వ విద్యాసంస్థల్లో లైబ్రరీలను ఏర్పాటు చేసి ఇ-లెర్నింగ్ మెటీరియల్ తో పాటు ఉచిత హై-స్పీడ్ Wifi ఉండేలా పునరుద్ధరణ.
6. శారీరక దివ్యంగులకు కోసం ప్రతి పాఠశాల మరియు కళాశాలలో అందుబాటులో ఉండేలా విశ్రాంతి గదుల రూపంలో ర్యాంప్‌లు, బ్రెయిలీ సంకేతాలు, ఎలివేటర్‌లు, వీల్‌చైర్ పార్కింగ్, వంటి వాటికి సౌలభ్య ఏర్పాటు.
జాంబవ స్టూడెంట్ స్పార్క్ సెంటర్
1. 12,000 గ్రామాల్లో జాంబవ Student Spark సెంటర్ల ఏర్పాటు. స్పార్క్ -సెంటర్లలో రీడింగ్ రూమ్ మరియు కోచింగ్ సెంటర్‌లను అభివృద్ధి చేయబడి, వివిధ పోటీ పరీక్షలకు హై-గ్రేడ్ ఉచిత శిక్షణ అందజేత.
2. మండల స్థాయిలోని Student Spark+ సెంటర్ల లో విద్యార్థులకు, గ్రాడ్యుయేట్లకు మరియు ఉద్యోగార్ధులకు 60 రోజుల కోచింగ్ మరియు నైపుణ్య శిక్షణ అందించడానికి, ప్రతి ఒక్కరికి రూ. 25,000 విలువైన ఆన్‌లైన్ కోర్సులను ఉచితంగా బోధించబడును. CAT, IIT-JEE, LAWCET మరియు విదేశీ ప్రవేశ పరీక్షలకు GRE, GMAT, IELTs, TOEFL వంటి వాటిపై ఉచిత కోచింగ్. Spoken English, Soft Skills, Communication, Problem Solving Skills, Stress Management, CV Writing మరియు డిమాండ్ లో ఉన్న AI, JAVA, C++, Python కోడింగ్ ప్రోగ్రామ్‌లలో శిక్షణ తరగతులు.
3. ప్రతీ ఒక్క స్పార్క్ సెంటర్‌లో హైస్పీడ్ Wifi, మరియు ఎయిర్ కండిషనింగ్‌తో 24X7 కంప్యూటర్ సౌకర్యం.
ఉద్యోగ అవకాశ హక్కు చట్టం
1. ప్రభుత్వం గుర్తించిన నైపుణ్యాల ద్వారా 15-35 ఏళ్ల వయస్సు గల ప్రతి వ్యక్తి తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునే హక్కును చట్టపరమైన ధృవీకరణ.
2. PPP (ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం) మోడల్ ఆధారంగా 21 శతాబ్దపు Industrial Training Institutes (ITIలు) నెట్‌వర్క్ ద్వారా కోరిన నైపుణ్యాన్ని 60 రోజుల్లో అందరికీ శిక్షణ మరియు ప్లేసెమెంట్ పొందేలా జిల్లా స్థాయి “Skill Development Authority” అందుబాటులో ఉంటుంది.
3. ప్రతి నగరాల్లో డిమాండ్‌లో ఉన్న నైపుణ్యాలను గుర్తించేందుకు Annual Skill Gap Survey ఆధారంగా అన్ని నైపుణ్యాలను (ఉదా: ఆసిఫాబాద్‌లో లెదర్‌వర్క్, కొమురం ఆసిఫాబాద్‌లో ఎకో-టూరిజం మరియు సిర్పూర్, మహబూబ్‌నగర్‌లో ఔషధ మొక్కల పెంపకం, అలంపూర్‌లో వస్త్రాలు నేయడం, టైల్స్ వేయడం) చేపలు పట్టడం వంటి వాటిని గుర్తించి, లంబాడీల నుంచి కోయల వరకు అన్ని నైపుణ్యాలను ధృవీకరణ.
4. Post Skilling Support Scheme (PSSC): నైపుణ్య శిక్షణ పొందిన అనంతరం సొంత సంస్థ ప్రారంభించడానికి అర్హులైన ప్రతి ఒక్కరికి “అబ్దుల్ కలాం బిజినెస్ సెంటర్ (ABC )” ద్వారా కొత్త వ్యాపార ఏర్పాటుకు పూర్తి సహకారం.
5. Credit Based Career Scheme(CBCS): అధికారికంగా, అనధికారికంగా లేదా క్రాఫ్ట్‌లో శిక్షణ పొందిన అన్ని నైపుణ్యాలను, వృత్తి పరమైన అవకాశాలను మెరుగు పరచడానికి అధికారికంగా ప్రభుత్వ ధృవీకరణ.
పండుగ సాయన్న నవ చేతన యువ సంఘాలు
1. కనీసం 10 మందితో కూడిన యువతను పండుగల సాయన్న నవ చేతన యువ సంఘాలుగా ఏర్పాటు.
2. ప్రతి జిల్లాకు గరిష్టంగా 100 సహకార సంఘాల (మొదటి దశలో) ఉపాధి కార్యకలాపాలకు ప్రోత్సహించడానికి పాలు మరియు నెయ్యి నుండి ప్రాసెస్ చేసిన పండ్ల వరకు బలమైన 'మేడ్-ఇన్-తెలంగాణ' ఉత్పత్తులను వారి స్థాపనలో ఏర్పాటుకు ఏటా రూ.15 లక్షల ఆర్థిక సహాయం మరియు 250 యూనిట్ల విద్యుత్ ఉచితం.
3. ప్రధానంగా మత్స్య పరిశ్రమ, పశుసంవర్ధక, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి, మరియు క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధి రంగాల్లో “పారదర్శక బ్రిడ్జింగ్” విధానం ద్వారా 25% ప్రభుత్వ కాంట్రాక్టులు యువ సంఘాలకు కేటాయింపు
కాన్షిరాం విద్యార్థి నాయకులు
1. అర్బన్ మరియు రూరల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కౌన్సిలర్, కార్పొరేటర్, వార్డు సభ్యులుగా యువతకు ప్రత్యేకంగా 33 శాతం కేటాయింపు.
2. విద్యార్థి సంఘానికి బాధ్యత వహిస్తున్న ప్రభుత్వ కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాల విద్యార్థి సంఘాల నాయకులను ఒక సంవత్సరం పాటు అన్ని విభాగాలలో 'షాడో మంత్రులు’గా నియామకం . మొట్ట మొదటి సారిగా విద్యార్థులను భవిష్యత్తు నాయకులుగా శక్తివంతం చేయడానికి మరియు విద్యార్థి సంఘాలు కోల్పోయిన వైభవాన్ని తిరిగి తెచ్చేందుకు అవకాశం కల్పన.
కమ్యూనిటీ మరియు కల్చర్ కనెక్ట్
1. ప్రతి మండలంలో సామూహిక వివాహాలు. ఒక్క కమ్యూనిటీ వెడ్డింగ్ కార్యక్రమానికి ఖర్చు రూ. 500,000 నుంచి రూ. 1,000,000 వరకు వేచ్చించుట. పాల్గొనే పెళ్లి జంటలకు రూ.25,000 ఆర్థిక సహాయం.
2. గద్దర్ యూనివర్సిటీ -మెదక్ జిల్లాలో తెలంగాణ కళలు మరియు సంస్కృతిని ప్రోత్సహించడానికి మూడు ఆర్ట్స్ అండ్ కల్చర్ అకాడమీల ఏర్పాటు.
3. రిణి శివతాండవం మరియు రాష్ట్రంలోని ఇతర నృత్య రూపాలను ప్రచారం చేయడానికి నల్గొండ జిల్లాలో నృత్య అకాడమీ ఏర్పాటు. జానపద కళలు బుర్రకథ, ఒగ్గు కథ ,యక్షగానం, వీధి నాటకం, హరిదాసు మరియు రాష్ట్రంలోని ఇతర కళలను ప్రోత్సహిస్తూ కరీంనగర్ జిల్లాలో జానపద అకాడమీ ఏర్పాటు. బిద్రీ పని, పోచంపల్లి ఇక్కత్ మరియు రాష్ట్రంలోని ఇతర క్రాఫ్ట్‌లను ప్రోత్సహిస్తూ మహబూబ్‌నగర్ జిల్లాలోని క్రాఫ్ట్స్ అకాడమీ ఏర్పాట
ABC: అబ్దుల్ కలాం ఇన్నోవేషన్ & బిజినెస్ సెంటర్
1. టైర్-2 నగరాల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ, వ్యవస్థాపకత ఆవిష్కరణలకు మద్దతు ఇవ్వడానికి దశలవారీగా ‘స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్’ తో అబ్దుల్ కలాం ఇన్నోవేషన్ & బిజినెస్ సెంటర్ స్థాప.
2. మొదటి దశ - వరంగల్, కరీంనగర్, ఆసిఫాబాద్, గద్వాల్.
3. రెండో దశ - ఖమ్మం, నిజామాబాద్, మరియు నల్గొండ.
4. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు (అట్టడుగు వర్గాల- SC, ST, BC, మతపరమైన మైనారిటీలను) సొంత వ్యాపారాన్ని ప్రారంభించడానికి మార్గదర్శకత్వం మరియు ఆర్థిక వనరులు, వసతులు (AC ఆఫీస్, హై స్పీడ్ Wifi) అందించడానికి పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు మొదలైన వారి ద్వారా ఇంక్యుబేషన్ హబ్‌లు గా సేవలందించడానికి ABC సెంటర్ల ఏర్పాటు.
5. గ్రామీణ మరియు రూరల్- తెలంగాణ అంతటా ఫుడ్-ప్రాసెసింగ్, హార్టికల్చర్, ఫ్లోరికల్చర్, ఫిషరీస్, డైరీ ఫామ్‌లు, పౌల్ట్రీ మరియు పశుసంవర్ధక వంటి రంగాలలో ఫోకస్డ్ స్టార్టప్‌ల స్థాపన మరియు అభివృద్ధిని సులభతరం చేయడానికి 0% వడ్డీతో మరియు తిరిగి చెల్లింపుపై 1- సంవత్సరం వడ్డీ ఊరట తో రుణాలు (Micro Loans) అందజేత.
‘ శ్రీకాంతాచారి’ ఉద్యోగ హామీ
1. .ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రభుత్వ రంగ విభాగాలు మరియు కార్పొరేషన్లలో పంచాయతీ నుంచి రాష్ట్ర స్థాయి వరకు వివిధ పరిపాలన పనులలో పాల్గొనడానికి 5 లక్షల మంది యువకులను ఒక సంవత్సరం పాటు నియామకం. స్పార్క్+ సెంటర్లలో 60 రోజుల ఉచిత నైపుణ్య శిక్షణ పొందే యువకులకు మొదటి ప్రాధాన్యత.
2. ఈ ప్లేస్‌మెంట్‌లు ప్రతి నెల రూ. 20,000 స్టైఫండ్‌తో, పాల్గొనే యువతి, యువకులకు ప్రభుత్వ రంగంలో రూపొందించే విలువైన పని అనుభవాన్ని పొందుతూ వారికి ఆర్థిక సహాయాన్ని అందిచుట.
3. Bridging the Gap Scheme (BGS): TSPSC/UPSC/PSU ల పరీక్ష సన్నాహాల్లో 2 సంవత్సరాలకు పైగా నిమగ్నమై ఉన్న యువతకు ఈ పథకం యొక్క ఫాస్ట్-ట్రాక్ ఎంపికలో నమోదు చేయడంతో పాటు వారికీ ఉన్న సరైన నైపున్యం ఆధారంగా ప్రభుత్వ రంగంలో అసోసియేట్‌లు/ఫెలోలుగా ఉద్యోగం పొందవచ్చు.
4. TSPSC జాబ్ క్యాలెండర్ ద్వారా లీకేజీ లేకుండా ప్రభుత్వ పరీక్షల నిర్వహణ జరిగేలా చట్టం అమలు.
పూర్ణ-ఆనంద్ క్రీడాస్పూర్తి (క్రీడలు & మానసిక ఆరోగ్యం)
1. పరిగెత్తగలే ప్రతి పేద బిడ్డకు స్పోర్ట్స్ షూస్ మరియు స్మార్ట్ వాచ్
2. అత్యుత్తమ క్రీడాకారుల శిక్షణకు ఆర్థిక సహాయంగా నెలకు రూ.15,000 స్టైపెండ్ అందజేయడం తో పాటు వారికి మెరుగైన ప్రతిభ కనబరచడానికి అవసరమైన పోషకాహారం కోసం రూ. 3000 విలువ చేసే పోషకాహార కిట్‌లు అందజేత.
3. వాతావరణ-నిరోధకత, సురక్షితమైన, పలురకాల ప్రయోజన శిక్షణ మరియు పోటీ సంబంధిత అవసరాలను తీర్చడానికి 33 జిల్లాల్లో అత్యాధునిక ఇండోర్ స్టేడియం.
4. ప్రతి జిల్లాలో ఒలింపిక్-సైజ్ షూటింగ్ రేంజ్‌లను ఏర్పాటుకు నెలకొల్పాన.
5. ప్రతి మండలానికి Swimming Pools.
6. పరీక్షల ఒత్తిడి, వృత్తి పరమైన మరియు వ్యక్తిగత సమస్యలు మెరుగ్గా ఎదుర్కొనేందుకు అవసరమైన కౌన్సెలర్/సైకియాట్రిస్ట్‌ని సంప్రదించడానికి వీలుగా విద్యార్థులు మరియు యువతకు జిల్లాకో Youth Mental Well-being Clubs.
7. తెలంగాణ స్కూల్ లీగ్: “USA లోని IVY” లీగ్‌తో తరహాలో ఉండే లక్ష్యంతో తరచు అంతర్ - మండల మరియు అంతర్-జిల్లా పోటీలు నిర్వహించుట.
8. Post-Professional Sporting Career - గుర్తింపు పొందిన అంతర్జాతీయ మరియు జాతీయ క్రీడాకారులు 500 గజాల స్థలం తో పాటు:
a) ఒలింపిక్ క్రీడాకారులకు రూ.కోటి రూపాయల వరకు ఆర్థిక సహాయం
b) అంతర్జాతీయ క్రీడాకారులకు రూ. 50 లక్షల ఆర్థిక సహాయం
c) జాతీయ క్రీడాకారులకు రూ. 25 లక్షల ఆర్థిక సహాయం
9. స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ ఆఫీసర్లు, ప్రొఫెషనల్ కోచ్‌లు, స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేటర్‌లు, ఫిజియోథెరపిస్ట్, రిఫరీలు, స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్, స్పోర్ట్స్ ఈవెంట్ మేనేజర్‌లుగా అథ్లెట్‌లను నియమించడం.